ఎంప్లాయబిలిటీలో ఆంధ్రప్రదేశ్ టాప్!

ఎంప్లాయబిలిటీలో ఆంధ్రప్రదేశ్ టాప్!

అమరావతి:

ఎంప్లాయబిలిటీ రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ వరుసగా రెండో ఏడాది అగ్రస్థానంలో నిలిచింది. ఏపీ తర్వాత రెండో స్థానంలో పశ్చిమ బెంగాల్, ఢిల్లీ మూడో స్థానంలో నిలిచాయి. ఎంబీఏలతో పోలిస్తే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు అధిక ఎంప్లాయబుల్ గా తమ పట్టు నిలుపుకున్నారు. ఒక దేశవ్యాప్త సర్వేలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. 29 రాష్ట్రాలు, 7 కేంద్ర పాలిత ప్రాంతాలలోని 3 లక్షలకు పైగా విద్యార్థులను పరీక్షించిన టైమ్స్ ఆఫ్ ఇండియా తన రిపోర్ట్ లో ఈ వివరాలను ప్రకటించింది. నగరాల విషయానికొస్తే ఎంప్లాయబిలిటీ విషయంలో బెంగుళూరు మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత స్థానాలలో చెన్నై, గుంటూరు, లక్నో, ముంబై, న్యూఢిల్లీ, నాసిక్, పూణె ఉన్నాయి. 15 జూలై నుంచి 30 అక్టోబర్ వరకు చేసిన సర్వేలో విద్యార్థుల ఇంగ్లిష్, క్రిటికల్ థింకింగ్, న్యూమరికల్ యాప్టిట్యూడ్, డొమైన్ నాలెడ్జ్, బిహేవియరల్ కంపీటెన్స్ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు.గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం ఎంబీఏ గ్రాడ్యుయేట్ల ఎంప్లాయబిలిటీ 3% పడిపోయింది. ఇంజనీరింగ్ విద్యార్థుల ఎంప్లాయబిలిటీ 5.6% పెరిగి 57.1 శాతానికి చేరుకుంది. అత్యధిక ఎంప్లాయబిలిటీ టాప్ 10 జాబితాలో రాజస్థాన్, హర్యానాలు కొత్తగా స్థానం సంపాదించడం విశేషం. గత ఏడాది టాప్ 10 లిస్టులో ఉన్న మధ్యప్రదేశ్, గుజరాత్, పంజాబ్ ఈ సారి చోటు దక్కించుకోలేక పోయాయి. ఆలిండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్, యుఎన్డీపీ, అసోసియేషన్ ఆఫ్ యూనివర్సిటీస్ తో కలిసి పీపుల్ స్ట్రాంగ్, వీబాక్స్, సీఐఐ తయారుచేసిన ఇండియా స్కిల్ రిపోర్ట్ 2019 ప్రకారం ఎంబీఏ, ఇంజనీరింగ్ విద్యార్థుల మధ్య ఎంప్లాయబిలిటీ వ్యత్యాసం రెండేళ్లుగా పెరుగుతోంది. దాదాపు 70% మంది ఫ్రెషర్లు ఏటా రూ.2 లక్షలు అంతకు మించి వార్షికాదాయాన్ని ఆశిస్తున్నారు. 47% మంది మాత్రమే 2.6 లక్షలు లేదా అంతకు మించి ఫస్ట్ పే చెక్ అందుకోగోరుతున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Widgetized Section

Go to Admin » appearance » Widgets » and move a widget into Advertise Widget Zone