పక్క రాష్ట్రం లో మొదలైన బడిబాట

పక్క రాష్ట్రం లో మొదలైన బడిబాట

ప్రక్క రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ లో ప్రారంభమైన బడి బాట 3 వ రోజు. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగమంతా ఆ బడి బాటలో పాల్గొన్నది. రాష్ట్రాధినేత ముఖ్యమంత్రి జగన్ గారు చిన్నారులతో అక్షరాభ్యాసం చేయించారు. చాల సంతోషకరమైన విషయం.
మరి మన రాష్ట్రంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గాని ముఖ్యమంత్రి గాని పాల్గొన్న విషయం గుర్తు చేసుకున్నా గుర్తుకు రావడం లేదు. ఇక ప్రభుత్వ పాఠశాలలపై ప్రజలకు నమ్మకమెలా కలుగుతుంది. మన దగ్గర బడిబాట ప్రారంభం కాకముందే బడుల మూతకు నిర్ణయం చేశారు. ఎన్ని బడులు మూయగలమో లెక్కకట్టి ప్రకటించారు వివిధ డి.ఇ.ఓ లు. కాని ఎన్ని బడులను బలోపేతం చేయగలం, తక్కువ విద్యార్థులున్న వాటిలో విద్యార్థుల సంఖ్య పెంచడానికి చర్యలు చేపట్టగలమని మేదోమధనం జరగలేదు. జరిగిందల్లా మూసేయడానికి మాత్రమే! ఈ ఆరేళ్ళ మన తెలంగాణ ప్రభుత్వం నామ మాత్రంగానే బడి బాట నిర్వహించింది,కాని ఒక ఉద్యమంగా జరిపిన దాఖలాలు లేవు.
అసలు బడి బాట అంటే అది కేవలం పంతుళ్ళదేనా! మిగతా ప్రజా ప్రతినిధులకు పట్టదా!
గ్రామ స్థాయి నుండి మండల,జిల్లా,రాష్ట్ర ప్రజా ప్రతినిధులు ముఖ్యమంత్రి మొదలుకొని గవర్నర్ వరకు విధిగా ఎందుకు పాల్గొనడం లేదు. వాళ్ళ బాధ్యత కాదా!
అలా పాల్గొనాలని ఆదేశాలు ఇవ్వాలని టిటిఎఫ్ రాష్ట్ర విద్యామంత్రి, ముఖ్యమంత్రికి మనవి చేస్తున్నాం.

-ఇ.రఘునందన్ టిటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Widgetized Section

Go to Admin » appearance » Widgets » and move a widget into Advertise Widget Zone