2019 August Month Horoscope

2019 August Month Horoscope

2019- August Horoscope

శ్రావణ మాస రాశి ఫలాలు

మేషరాశి::

ఈ రాశిలో అన్ని రంగముల వారికి ఇబ్బందులు తప్పవు ,ఆర్థిక లావాదేవీలు సంతృప్తి నివ్వవు, ఆదాయమునకు మించిన ఖర్చులు, శత్రువులవలన భయం, ఆందోళన కలిగిం‌చు సంఘటనలు, సంతానము వలన ఇబ్బందులు కలుగును.
గణేష పంచరత్న స్తోత్రం పఠించడం వలన కాస్త ఉపశమనం లభిస్తుంది,.

………………………………………………………………..

వృషభ రాశి::

ఈ రాశి వారికి ప్రథమార్ధంలో చాలా బాగుంటుంది. వాపారస్తులకు కలసి వస్తుంది, ఆరోగ్యలాభం , నూతన వస్తు ప్రాప్తి, కుటుంబ సౌఖ్యం, ప్రయాణ లాభం బంధుమిత్ర సౌఖ్యం, నూతన వ్యక్తులతో లాభములు, కొత్త పనులకు శ్రీకారం చుట్టదెరు..
ఈ రాశివారు దుర్గసప్తశ్లోకి పారయణం చేయుట వలన విశేష ఫలితాలు పొందవచ్చును..

………………………………………………………………..

మిథున రాశి::

ఈ రాశిలో అన్ని రంగముల వారికి లాభామె ఉంటుంది ఈ నెలంతా , వృత్తి వ్యవహారాలు ఉద్యోగాదులు లభించును , విద్యార్థులు పరీక్షలలో ఉత్తీర్ణత సాదిస్తారు. కుటుంబంలో సంతోషాదులు. సంఘంలో ఉన్న స్థితి కొన్ని ముఖ్య సమస్యల వలన మాసాంతంలో కొంతమేర అశాంతి ఏర్పడును.,
ఈ రాశివారు హనుమాన్ చాలిసా పారాయణం చేయటం ద్వారా శుభఫలితాలు పొందవచ్చును.,

………………………………………………………………..

కర్కాటక రాశి::

అన్ని రంగముల వారికి బాగుంటుంది, చేయు వృత్తి వ్యాపారాదులలో రాణిస్తారు. ఆదాయ వృద్ది, ఆరోగ్య లాభం, సంతాన సౌఖ్యం, స్త్రీ సౌఖ్యం నూతన పరిచయాలు లాభించును. మాసాంతంలో శత్రు భయం, వాహన సంబంధ ఖర్చులు అయ్యే అవకాశముంది‌. ఋణవిమోచన గణపతి స్తోత్ర పారాయణం,

ఈ రాశివారు రుద్రాభిషేకం చేయటం వలన శుభఫలితాలు పొందవచ్చు.,

………………………………………………………………..

సింహరాశి::

ఈ నెల ప్రథమార్ధంలో బాగుంటుంది. అన్ని రంగముల వారు రాణిస్తారు, కాని ఆర్థిక లావాదేవీలు సంతృప్తినివ్వవు. ద్వితీయార్థంలో కాస్త పరవలేదు. ఉద్యోగులకు బదిలీలు తప్పవు. అధికారుల వలన ఇబ్బందులు అవమానములు ఎదురగును, కోర్టు వ్యవహారములందు జాప్యం జరుగును ..
శనివారంనాడు అశ్వత్థ వృక్షమునకు ప్రదక్షినలు చేసి,అశ్వత్థ నారాయణ ఆరాధన చేయుటవలన కార్యసిద్ది కలుగును.

………………………………………………………………..

కన్యా రాశి::

ఈ నెలలో చేయు వృత్తి వ్యాపారాలు అంతగా రాణించవు. శారీరక శ్రమ, ఆరోగ్య భంగములు, ప్రతిచిన్న విషయానికి కలవర పడుట, సమస్యలతో ఉక్కిరిబిక్కిరి అవుతారు, ప్రభుత్వ సంబంధ చిక్కులు ఉన్ననూ పరిస్థితులు ధైర్యంగా ముందుకు నడిపించును . కోర్టు వ్యవహారాలు ఆశాజనకంగా ఉండును..

లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్ర పారాయణ శుభఫలితాలను ఇస్తుంది‌,

………………………………………………………………..

తులా రాశి::

ఈ నెలయందు చేయువృత్తి వ్యపారముల యందు అనుకూలంగా ఉంటాయి. ఆరోగ్యం బాగుంటుంది, ఆదాయానికి లోటుండదు. మీ బుద్దిబలం ఆకర్షణ వలన ఎవరినైన ఇట్టే వశపరచుకుంటారు. శత్రువులపై విజం , నూతన వాహన ప్రాప్తి, గృహములో మార్పులు, వ్యవహారానుకూలత,కోర్టు వ్యవహారాల్లో జయం కలుగును. నిత్యం శ్రీ నృసింహ కరావళంభ స్తోత్రం పారాయణం చేయుట వలన కార్యములన్నియూ దిగ్విజయముగా పూర్తి అగును.

………………………………………………………………..

వృశ్చిక రాశి::

అన్ని రంగముల వారికి ఆశాజనకంగా ఉంటుంది, వృత్తి వ్యాపారాలయందు రాణింపు, ఆదాయ వృద్ది కలుగును. ఆరోగ్యం గృహమున శుభవార్తలు, ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, విద్యార్థులకు మంచి వార్తలు, బంధుమిత్రాదులతో విందులు వినోదాలలో పాల్గొంటారు, కోర్టు వ్యవహారాలయందు అపజయం.
ప్రతి ఆదివారం దుర్గమాత ఆలయ సందర్శన చేస్తు ,నిత్యం ఆపదుద్దారక దుర్గ స్తోత్రం పఠించడం విజయాన్ని చేకూరుస్తుంది.,

………………………………………………………………..

ధనస్సు రాశి::

అన్ని రంగముల వారికి వృత్తి వ్యపారాదులయందు రాణింపు ఉంటుంది, అన్నింటా జయం, ఉద్యోగులకు ప్రమోషన్, గృహమార్పులు, స్థాన మార్పులు, ఆధికారుల మన్ననలు, కోర్టు వ్యవహార జయం , రాజకీయంగా బాగుంటుంది, స్పెక్యులేషన్‌లో నష్టాలు, స్థిరాస్తి అమ్మకం జరుగును.
ప్రతి నిత్యం శ్రీ వేంకటేశ్వర అష్టోత్తర శతనామ స్తోత్ర పారాయణ, ప్రతి శనివారం వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించిన శుభం‌ కలుగుతుంది.,

………………………………………………………………..

మకర రాశి::

అన్నింటా జయం , చేయు వృత్తి వ్యాపారాలు కొంత అనుకూలించును, ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి, వాహన సౌఖ్యం, బంధుమిత్రుల సహాయసహకారాలు లభిస్తాయి, గృహమార్పులు తప్పవు, దైవ దర్శన ములు గృహంలో శుభకార్యాలు.

శనైశ్చర స్వామికి నువ్వులనూనెతో అభిషేకం,
ప్రతి శనివారం ఆంజనేయస్వామికి పదకొండు ప్రదక్షిణలు చేస్తే ఆరోగ్యలాభం కలుగును.,

………………………………………………………………..

కుంభ రాశి::

వృత్తి వ్యాపారాలలో రాణింపు,వ్యవహార జయం,‌ ఆర్థికంగా బాగుంటుంది, రావలసిన సొమ్ము సరైన సమయంలో అందుతుంది, దైర్యంతో మొండిగా వ్యవహరించుట, కుటుంబ సఖ్యత,సంతాన సౌఖ్యం, కోర్టు వ్యవహారాల యందు జయం,నూతన గృహనిర్మాణ ప్రారంభం చేస్తారు..
ప్రతి నిత్యం దక్షిణామూర్తి స్తోత్రం,గురుచరిత్ర పారాయణం మేలు చేకురుస్తుంది.

………………………………………………………………..

మీన రాశి::

ఈ నెలలో చేయు పనులయందు మీ మాటకు తిరుగు లేదు. అన్ని విదాలుగా బాగుంటుంది. మీ శక్తి సామర్థ్యాలు అందరికి తెలియును, గృహనిర్మాణాలు కలిసి వస్తాయి.‌‌ ఉద్యోగులకు ప్రమోషన్‌తో కూడిన బదిలీలు, దైవ దర్శనం, రాజకీయనాయకుల పరిచయాలు, ఆకస్మిక ధనలాభం, సత్కార్యాచరణాలు చేసెదరు.

హయగ్రీవ నవరత్న మాలిక స్తోత్ర పారాయణ, గో సేవ చేయటం వలన విద్యా ఆరోగ్య, ఉద్యోగభివృద్ది కలుగును.,

మీ…….పురోహిత సార్వభౌమ, జ్యోతిష్య శిరోమణి, జ్యోతిష్య “మహర్షి” డా” మోహనకృష్ణభార్గవ.Ph.D

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Widgetized Section

Go to Admin » appearance » Widgets » and move a widget into Advertise Widget Zone