Abolish CPS revive OPS

Abolish CPS revive OPS

Teachers of government-run institutions on two-day strike

Contributory Pension Scheme Teachers Employees Association Telanga State ( CPSTEATS)

సీ పీ ఎస్..
తాజాగా మళ్లీ సీరియస్ గా ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలు సంఘటితంగా చర్చించుకుంటున్న ప్రధాన అంశం అయింది. సెప్టెంబర్ 1 న రాష్ట్ర రాజధాని తో పాటు జిల్లా కేంద్రాల్లోనూ రాజకీయ ప్రముఖులు, ఉద్యోగ సంఘాల నాయకులు సీ పీ ఎస్ పై జరిగిన వాడి వేడి చర్చ కార్యక్రమంలో పాల్గొన్నారు.ప్రభుత్వాలు మిమ్మల్ని నమ్మించి గొంతు కోశాయని, ఉధృత ఉద్యమం తోనే సీ పీ ఎస్ రద్దు సాధ్యమవుతుందని ఉద్యోగ ఉపాధ్యాయ శ్రేణులకు సందర్భానుచితంగా సంఘీభావం తో సముదాయిస్థూనే..మీ ఆరాటానికి పోరాటమే శరణ్యమని పిలుపునిచ్చారు.ఈ విధoగా కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం పై మరో మారు.అటు ఉపాధ్యాయ, ఇటు ఉద్యోగ సంఘాలు కాస్త ఉద్యోగులతో తమ పెన్షన్ “టెన్షన్” ను కాస్తో కూస్తో పంచుకునే ప్రయత్నం చేశాయి.ఆ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ 1 న భాగస్వామ్య పింఛను పధకం గురించి జరిగిన చర్చల్లో ,నిరసన కార్యక్రమాల్లో సీ పీ ఎస్ ను రద్దు చేయాల్సిందే .చేసేవరకు పోరాటం ఆగదు అని ఆయా సంఘాలు శక్తిమేరకు నినదించాయి .సీ పీ ఎస్ రద్దు గురించి ఆలోచించనందుకు పాలకులను నిందించాయి.
సీ పీ ఎస్ ను రద్దు చేసే ఆలోచన తమకు పట్టనట్లుగా వ్యవహరించడం ప్రభుత్వాలకు తగదని భాగస్వామ్య పింఛను పధకం ఉపాధ్యాయ ఉద్యోగ సంఘం తెలంగాణ రాష్ట్ర (సీ పీ ఎస్ టీ ఈ ఎ టీ ఎస్) అధ్యక్షులు దామక కమలాకర్ అభిప్రాయ పడ్డారు. ఉద్యోగుల వేతనాలను షేర్ మార్కెట్ కు తరలించి, లాభనష్టాలను తాము పట్టించుకోబోము అని కొత్త పింఛను విధానం సూత్రీకరించడాన్ని హైదరాబాద్ ఖైరతాబాద్ లో జరిగిన సీ పీ ఎస్ ఉద్యోగుల సంక్షేమ సంఘం సదస్సులో రాజకీయ , ఉద్యోగ సంఘాల నాయక ప్రముఖులకు సోదాహరణంగా వివరించారు. అలాగే ఈ సదస్సు వేదికగా వీ రామకృష్ణ , టీ వీ ప్రసాద్ లు సైతం సీ పీ ఎస్ రద్దు చేయమని తామందరం ఎందుకు గొంతుచించుకొని ప్రాధేయపడవలసిన అవసరం వస్తుందో పాలకులు అర్ధం చేసుకోవాల్సిందిగా ప్రార్ధించారు. ఈ సదస్సుకు హాజరైన టీ ఎన్ జీ ఓ నాయకులు కారెం రవీందర్ రెడ్డి , టీజీవో నాయకులు మన్నెబొయిన కృష్ణా యాదవ్ , సత్యనారాయణ లకు కూడా సదస్సు ద్వారా సీ పీ ఎస్ ఉద్యోగుల ఆవేదనను “ఆర్ధిక” వేతలనూ మీ మనస్సు తో ఆలోచించి అర్ధం చేసుకోవాల్సిందిగా అభ్యర్ధించారు. సీ పీ ఎస్ టీ ఈ ఏ టీ ఎస్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి మాచన రఘునందన్ సదస్సు సందర్భంగా మాట్లాడుతూ.. ప్రైవేటు ఉద్యోగుల మాదిరే సీ పీ ఎస్ ఉద్యోగుల జీవితాలకు పెన్షన్ భద్రత లేకుండా పోయిందన్నారు. ప్రభుత్వ ఉద్యోగం అంటే పదవీ విరమణ చేశాక పెన్షన్ వస్తుందన్న ఆర్ధిక భద్రత భావం ఉద్యోగుల్లో వారి కుటుంబాల్లో ఉండేదని,కానీ ఇపుడు పెన్షన్ లేదన్న టెన్షన్ మాత్రం మిగులుతోందన్నారు. సీ పీ ఎస్ ఉద్యోగి కి జరగకూడనిది ఏమైన జరిగితే వారి కుటుంబాలు ఆర్ధిక పెన్షన్ ఆసరా కరువై రోడ్డు పాలవుతున్నాయన్నారు.తమ కష్టార్జితం సీ పీ ఎస్ పధకం ద్వారా ఎక్కడ జమ అవుతుందో. దేనికి వాడుకుని లాభనష్టాలను గణిస్తున్నారో తెలియని అయోమయ పరీస్థితి లో ఉద్యోగులు ఉన్నారని అన్నారు. ఎంత జమ ఐనది .అవసరమైతే ఎలా తీసుకోవాలి ఎంత తీసుకోవాలి. అన్న సందేహాలు నివృత్తి చేసే నాధుడే కారువయ్యాడని మాచన రఘునందన్ సీ పీ ఎస్ ఉద్యోగుల అగమ్యగోచర పరీస్థితిని విశదీకరించారు.2004 లో సెప్టెంబర్ 1 నుండి ప్రవేశ పెట్టబడిన ఈ న్యూ పెన్షన్ స్కీం లో కొనసాగేలా, వద్దా అని నిర్ణయించుకునే అధికారం రాష్ట్రాలకు ఉన్నపటికీ ..కేంద్రానికి సంభందించింన విషయంగా రాష్ట్ర లు పరిగణించడం. సమంజసం కాదన్నారు. గత కొంతకాలంగా రాష్ట్ర,దేశ వ్యాప్తంగా సీ పీ ఎస్ రద్దు చేయాలంటూ రాష్ట్ర,కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు నిరసనలు తెలిపినా ప్రయోజనం లేకపోవడం తో ఉద్యోగుల లో నైరాశ్యం నెలకొన్నదని రఘునందన్ మాచన అభిప్రాయ పడ్డారు.
దాదాపు లక్షా నలభై వేలకు పైగా సీ పీ ఎస్ ఉద్యోగులు ఉన్నారని వారంతా పాత పెన్షన్ పధకాన్ని పునరుద్ధరించాలని కోరుకుంటున్నారని చెప్పారు.సీ పీ ఎస్ వద్దు..ఓ పీ ఎస్ ముద్దు అంటూ సీ పీ ఎస్ రద్దు కోసం ఉద్యమించడంలో భాగంగా సెప్టెంబర్ నెల లో ప్రతీ ప్రభుత్వ కార్యాలయాలలో సీ పీ ఎస్ ఉద్యోగులు గంట పాటు అధికంగా పనిచేయాల్సిందిగా దాముక కమలాకర్ పిలుపు నివ్వడం రాష్ట్ర వ్యాప్తంగా చక్కటి స్పందన లభించిందన్నారు.పత్రికలు ప్రసార సాధనాలు ,సామాజిక మాధ్యమాల ద్వారా సీ పీ ఎస్ రద్దు కోసం చేస్తున్న పోరాటం ఇప్పటికే ప్రభుత్వాల దృష్టికి వచ్చినప్పటికీ , పదోన్నతులు పదవీ విరమణ వయో పరిమితి పెంపు అంశాలను పాలకులు తెలివిగా తేరపైకి తీసుకువచ్చి సీ పీ ఎస్ రద్దు కోసం జరుగుతున్న పోరాటాన్ని మరిచిపోయేలా మంత్రం వేస్తున్న వైనాన్ని ఉద్యోగులు పసిగట్టలేరా అని ప్రశ్నించారు. సకల జనుల సమ్మె లో 42 రోజులు “నో వర్క్ నో పే” వల్ల పస్తులుండి సొంత రాష్ట్రం కోసం చేసిన ఉద్యమం ఇంకా ఉద్యోగుల మదిలోనే ఉన్నదని, తెలంగాణ కోసం పోరాడి సాధించుకోగల్గినపుడు .సీ పీ ఎస్ రద్దు కోసం కూడా అదే ఉద్యమ స్పూర్తిని ఉద్యోగులు ప్రదర్శించడానికి సమాయత్తమయ్యే తరుణం కూడా రానున్నదని సీ పీ ఎస్ ఉద్యమ నేతలు ఆశాభావం వ్యక్తంచేస్తున్నట్లు మాచన రఘునందన్ చెప్పారు. సీ పీ ఎస్ రద్దు కోసం గల్లీ నుంచి ఢీల్లీ దాకా ఉద్యమించి,ప్రత్యేక తెలంగాణ తెచ్చుకున్నట్లే ..పాత పెన్షన్ పధకాన్ని పునరుద్ధరించేలా సీ పీ ఎస్ ఉద్యోగులు ఉద్యమించి ఓ పీ ఎస్ ను సాధించి తీరగలరన్న వాస్తవం చరిత్ర పుటల్లో లిఖించబడే రోజు మరెంతో దూరంలో లేదన్నారు. ముఖ్యమంత్రి కె సీ ఆర్ వల్లే తెలంగాణ సిద్దించినట్లు .పాత పెన్షన్ పునరుద్ధరణ కూడా ఆయన హయాంలోనే జరుగుతుందన్న ప్రగాఢ విశ్వాసాన్ని సీ పీ ఎస్ ఉద్యోగులు కలిగి ఉన్నారని మాచన రఘునందన్ అన్నారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఘనత గల్గిన తెలంగాణ రాష్ట్రం నుంచే సీ పీ ఎస్ రద్దు కూడా జరుగుతుందని అనుకోవడలో ఏ మాత్రం సందేహం లేదన్నారు.

Contributory Pension Scheme Teachers Employees Association Telanga State ( CPSTEATS)
President
DAAMUKA KAMALAKAR
Publicity Secretary
RAGHUNANDAN MAACHANA,

V RAMAKRISHNA
President
Contributory Pension Scheme Employees Welfare Association

Source: info@manastate.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Widgetized Section

Go to Admin » appearance » Widgets » and move a widget into Advertise Widget Zone