Aham Brahmasmi (త్వమేవాహమ్‌)

Aham Brahmasmi (త్వమేవాహమ్‌)

“Infinite by nature, the Supreme Self is described here by the word Brahman (lit. ever expanding; the ultimate reality); the word asmi denotes the identity of ahamand Brahman. Therefore, (the meaning of the expression is) “I am Brahman.” This realization is gained through true enquiry.

త్వమేవాహమ్‌

కన్నతల్లి కడుపులోంచి బయటపడి, తొలిసారి ఊపిరిని పీల్చిన క్షణం నుంచి, పుడమితల్లి కడుపులోకి చేరుకునేందుకు ఆఖరిసారి ఊపిరిని విడిచిపెట్టడం దాకా సాగే ప్రస్థానం పేరే…‘నేను’!
ఈ నేను- ప్రాణశక్తి అయిన ఊపిరికి మారుపేరు. ఊపిరి ఉన్నంతదాకా ‘నేను’ అనే భావన కొనసాగుతూనే ఉంటుంది. జనన మరణాల మధ్యకాలంలో సాగే జీవన స్రవంతిలో ఈ ‘నేను’ ఎన్నెన్నో పోకడలు పోతుంది. మరెన్నో విన్యాసాలూ చేస్తుంది.

ఈ ‘నేను’ లోంచే ‘నాది’ అనే భావనా పుడుతుంది.

‘నాది’లోంచి నా వాళ్ళు, నా భార్య/భర్త నా పిల్లలు, నా కుటుంబం, నా ఆస్తి, నా ప్రతిభ, నా ప్రజ్ఞ, నా గొప్ప… అనేవీ పుట్టుకొచ్చి చివరికి ఈ ‘నేను’ అనే భావన భూమండలాన్ని కూడా మించిపోయి. ఆకాశపు సరిహద్దును కూడా దాటిపోయి, నిలువెత్తు విశ్వరూపాన్ని దాల్చిన ‘అహం’గా ప్రజ్వరిల్లుతుంది.

‘అహం’ అనే మాయపొర కమ్మేసిన స్థితిలో ఈ ‘నేను’ ‘నేనే సర్వాంతర్యామిని’ అని విర్రవీగుతుంది. నాకు ఎదురే లేదని ప్రగల్భాలూ పలుకుతుంది. పంతాలతో పట్టింపులతో, పగలతో ప్రతీకారాలతో తన ప్రత్యర్థిని సర్వనాశనం చేయడానికీ సిద్ధపడుతుంది. బాల్య, కౌమార, యౌవన, వార్ధక్య దశలదాకా విస్ఫులింగ తేజంతో విజేతగా నిలిచిన ‘నేను’ అనే ప్రభ… ఏదో ఒకనాడు మృత్యుస్పర్శతో కుప్పకూలిపోతుంది.

వందిమాగధులు కైవారం చేసిన శరీరం కట్టెలా మిగులుతుంది. మదనోత్సవాలు జరుపుకొన్న దేహం నిస్తేజంగా పడి ఉంటుంది.
సుఖభోగాలతో, అష్టైశ్వర్యాలతో తులతూగిన ‘నేను’- చుట్టూ చేరిన బంధుమిత్ర సపరివారపు జాలి చూపులకు కేంద్ర బిందువుగా మారుతుంది.
కడసారి చూపులకోసం, కొన్ని ఘడియలపాటు ఆపి ఉంచిన విగతజీవికి అంతిమయాత్ర మొదలవుతుంది.
మరుభూమిలో చితిమంటల మధ్యే సర్వబంధనాల నుంచీ విముక్తి కలుగుతుంది. మొలకుచుట్టిన ఖరీదైన దేహం, మొత్తంగా కాలి బూడిద అవుతుంది.
నేనే శాసన కర్తను, నేనే ఈ భూమండలానికి అధిపతిని, నేనే జగజ్జేతను… అని మహోన్నతంగా భావించిన ‘నేను’ లేకుండానే మళ్ళీ తెల్లవారుతుంది. రోజు మారుతుంది.

ఊపిరితో మొదలై ఊపిరితో ఆగిన నేను కథ అలా సమాప్తమవుతుంది. అందుకే ఊపిరి ఆగకముందే నేను గురించి తెలుసుకో- అంటుంది భగవద్గీత.
చితిమంటలను చూస్తున్నప్పుడు కలిగేది శ్మశానవైరాగ్యం మాత్రమే. అది శాశ్వతం కానే కాదు. నేను గురించిన సంపూర్ణమైన అవగాహనతో ఉన్నప్పుడే, పరిపూర్ణమైన వైరాగ్యస్థితి సాధ్యమవుతుంది.
వైరాగ్యం అంటే అన్నీ వదిలేసుకోవడం కానేకాదు. దేనిమీదా మోహాన్ని కలిగి ఉండక పోవడం, తామరాకుమీద నీటి బొట్టులా జీవించగలగడం.
స్వర్గ నరకాలు ఎక్కడో లేవు. మనలోనే ఉన్నాయి. మనిషికి, ఆత్మదృష్టి నశించి బాహ్యదృష్టితో జీవించడమే- నరకం. అంతర్ముఖుడై నిత్యసత్యమైన ఆత్మదృష్టిని పొందగలగడమే- స్వర్గం. ఈ జీవన సత్యాన్ని తెలియచేసేదే వేదాంతం.

నిజాయతీగా, నిస్వార్థంగా, సద్వర్తనతో, సచ్ఛీలతతో భగవత్‌ ధ్యానంతో జీవించమనేదే వేదాంతసారం.
‘అహం బ్రహ్మాస్మి’- అంటే- ‘అన్నీ నేనే’ అనే స్థితి నుంచి ‘త్వమేవాహమ్‌’… అంటే- ‘నువ్వే నేను’ అని భగవంతుడి పట్ల చిత్తాన్ని నిలుపుకోగల తాదాత్మ్య స్థితిని చేరుకోగలిగితేనే మానవ జన్మకు సార్థకత సిద్ధిస్తుంది!..

7 Responses to Aham Brahmasmi (త్వమేవాహమ్‌)

 1. http://canadianorderpharmacy.com/ June 4, 2019 at 12:58 am

  I am really loving the theme/design of your blog. Do you ever run into any web browser compatibility problems? A couple of my blog visitors have complained about my site not operating correctly in Explorer but looks great in Chrome. Do you have any recommendations to help fix this issue?

  Reply
 2. canadian drugs November 11, 2019 at 2:07 am

  This is one awesome article. Really looking forward to read more. Will read on… vipps approved canadian online pharmacy

  Reply
 3. viagra generic November 12, 2019 at 3:12 am

  Very nice post. I just stumbled upon your blog and wished to say that I have truly enjoyed browsing your blog posts. After all I will be subscribing to your feed and I hope you write again soon! viagra generic

  Reply
 4. viagra November 22, 2019 at 1:20 pm

  you’re really a good webmaster. The web site loading speed is incredible. It seems that you’re doing any unique trick. Moreover, The contents are masterpiece. you have done a wonderful job on this topic! parapharmacie en ligne.

  Reply
 5. canadian online pharmacy no prescription November 28, 2019 at 4:13 am

  Thanks for the article. Want more. online pharmacy reviews

  Reply
 6. Anonymous December 8, 2019 at 8:32 am

  Great article. viagra samples usa

  Reply
 7. kratom online December 8, 2019 at 9:46 am

  I think that is among the such a lot important info for me. And i’m glad studying your article. However want to statement on some normal issues, The site taste is wonderful, the articles is in reality nice : D. Excellent task, cheers kratom tea

  Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Widgetized Section

Go to Admin » appearance » Widgets » and move a widget into Advertise Widget Zone