Foot Ball National Team Winner

Foot Ball National Team Winner

Employees Provident Fund Gujarat State Officer Pannela vidyasagar

ఉద్యోగుల భవిష్య నిధి (ఈ పీ ఎఫ్) ఫూట్ బాల్ జాతీయ జట్టు సారధి మన తెలుగు తేజం.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అమరచింత ఆత్మకూరు కుర్రోడు ఇపుడు జాతీయ స్థాయిలో క్రీడల్లో మెరుస్తున్నాడు. ఎంప్లాయిస్ ప్రోవిడెంట్ ఫండ్ గుజరాత్ రాష్ట్ర అధికారి అయినటువంటి పన్నెల విద్యాసాగర్ మూలాలు తెలంగాణ లోని ప్రస్తుత వనపర్తి జిల్లా ఆత్మకూరు కు చెందిన వాడు.మాతామహుల వద్ద ఆత్మకూరు లో పాఠశాల విద్య అభ్యసించి కుటుంబం గుజరాత్ లో స్థిరపడటం వల్ల అక్కడే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల భవిష్య నిధి అధికారిగా విధి విర్వర్తిస్తూనే ఆ శాఖ క్రీడా ప్రోత్సాహoతో .జాతీయ స్థాయిలో రానిస్తున్నాడు.రాష్ట్ర స్థాయి, ప్రాంత స్థాయి జట్లకు తన చక్కటి ప్రణాళికతో సారధ్య బాధ్యతలు నెరిపే ఈ తెలుగు తేజం ఇపుడు ఈ పీ ఎఫ్ ఫూట్ బాల్ జుట్టును జాతీయ స్థాయికి తీసుకెళ్లారు.
గురువారం ప్రాంతస్థాయి ఆట ను వరంగల్ లో నిర్వహించారు. ఈ పోటీలో 2-0 స్కోరుతో మహారాష్ట్రాను ఓడించారు. దీంతో నేషనల్ లెవెల్ కు పన్నెల విద్యాసాగర్ నేతృత్వం లొనే జట్టు గౌహతి లో జరిగే పోరులో తలపడనుంది.
ఉద్యోగుల్లో క్రీడాసక్తి ని ప్రోత్సహిస్తే బహువిధాలుగా ప్రయోజనం ఉంటుందని విద్యాసాగర్ పన్నెల అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Widgetized Section

Go to Admin » appearance » Widgets » and move a widget into Advertise Widget Zone