Mallesham is the biopic of Padma Shri awardee Chintakindi Mallesham

Mallesham is the biopic of Padma Shri awardee Chintakindi Mallesham

Mallesham is the biopic of Padma Shri awardee Chintakindi Mallesham, but it doesn’t just show how he succeeded at completing the famous Asu machine, it also showcases the journey of many a Pochampally handloom weaver of Telangana who are deprived due to lack of livelihood from the art. Despite the numerous hardships the protagonist and villagers face, the film never lets the audience lose hope and instead keeps their confidence by finding solutions and searching for light at the end of the tunnel.

తెలంగాణ ఆత్మ..”మల్లేశం” సీన్మా

పద్మశ్రీ చింతకింది మల్లేషం జీవితాన్ని తెరకెక్కిస్తున్నారని,గత సంవత్సరం స్వయంగా అన్న, ఆత్మీయులు చింతకింది మల్లేశం నాకు ఫోన్ చేసి, నా గురించి సీన్మా తీస్తారంట, ఆసు మెషీన్ ల వర్క్ షాప్ సూసే తందుకు ఎవరో డైరెక్టర్ వస్తున్నడట అని చెప్పినప్పటినుంచి.. వార వారం ఏం జేస్తున్నారు, ఎక్కడ తీస్తున్నరు అని ఇంట్రస్టు సూపిచుకుంటా అర్సుకుంటున్న. ఒక రోజు ఆర్ట్ డైరెక్టర్ ఏలే లక్ష్మన్ సార్ ఫోన్ చేసి, “మనోళ్ళను తీస్కొని మల్లేశం షూటింగ్ కాడికి రా..” ఆని చెప్పిండు.సీనియర్ జర్నలిస్టు కోడం పవన్ కుమార్ ను ఎంట వెట్టుకొని ఆ సినిమా చిత్రీకరణ జరుపుకుంటున్న రేవణపల్లి కి పోయినం షూటింగ్ సూశ్నo. అప్పటికే ఆడికి దక్షిణ మధ్య రైల్వే బీ సీ ఉద్యోగుల సంఘం నాయకులు ధీకొండ పద్మనాభం, మార్త రమేష్ కలిసి వచ్చిండ్రు.ఉద్యోగ సంఘాల నాయకులు వచ్చిన సంగతి తెలిసిన భూదాన్ పోచంపల్లి విలేకరులు,సార్..మమ్మల్ని ఏం రాయమంటారు అని అడిగితే, ఆలేరు పక్కకున్న మారుమూల గ్రామం శరాజీపేట నుంచి ఆరోది మాత్రమే సద్విన ఒక వ్యక్తి “పేగు బంధం” కోసం “పోగు భంధం” వేసే ఆసు యంత్రం కని పెట్టడమన్న విషయం ఒక అసాధారణమని తారీఫ్ జేష్ణం. అప్పుడే మనసులో ఫిక్స్ అయ్యా ..మల్లేశం సినీమా సూస్థoదుకు, జనం మా మల్లేశం,మన మల్లేశం సినీమా సూసుడు ఇగేప్పుడుల్లా.. అని గడప గడప న గల్లీ గల్లీల్లో ఒక్క తీరుగా.. అడుగుడు మొదలువే డతారని అనుకంటనే ఉన్న. ఒక రోజు మల్ల లక్ష్మణ్ సారే మెసేజ్ పెట్టిండు ఇయ్యాల ట్రైలర్ ఉంది ప్రసాద్ ల్యాబ్స్ కు రమ్మని,పోత పోత టీ పొపా మహిళా విభాగం ఛైర్ పర్సన్ సారంగ రేవతి కి కూడ చెప్పిన మల్లేశం అన్నను,మల్లేశం సీన్మా నూ సూద్దాం రమ్మని,ఆమె సుత వచ్చింది. అరే సీన్మా జబ్బర్ధస్త్ ఉండేటట్టుంది, తెలంగాణ ల దుమ్ము లేప్తది పో..అన్నది. ఇగ మళ్ళా.. గా మల్లేశం అన్న నే యాల్ల.. పొదుగాళ్ల జూన్ 11 నాడు ఫోన్ చేసి చెప్పిండు.ఇయ్యాల 6 గొట్టంగ ప్రీవ్యూ ఉంది నువ్వు తప్పకుండా రావాలె..మర్శి పోయేవుమరి అని ఒక్క తీర్గ చెప్పేవరకల్లా . మల్లేశం అన్న చెప్పినంక యాది మరసుడా అని.పోత పోత బేగంపేట ల ఏ ఎమ్ డీ ఆఫీసుల భూ భౌతిక విజ్ఞాన శాస్త్ర సైoటిస్టు,రాష్ట్రపతి పురస్కార గ్రాహిత డాక్టర్ వెల్డి రమేష్ బాబు కు ఫోన్ జేశ్న .ఇయ్యాల మల్లేశం ప్రీమియర్ ఉందంట జెర ఎట్లనన్న సూసోత్తాoరారాదు అని జూబ్లీహిల్స్ రామానాయుడు స్టూడియో కు మేమిద్దరం పోయినం.7గంటలకు శురువైన సినిమా ను ఇంటర్వెల్ దాకా చూసి ఇంటర్వెల్ కు లైట్లు పడంగానే మా ముంగటి లైన్ లనే కూసున్న చక్రపాణి ని సూషీ అరె మస్తు చెష్ణావని మస్థుమంది శెభాష్ అన్నరు. ఇంటర్వెల్ వరకల్లా మల్లేశం అన్న,ఆర్ రాజ్ ఇంకా ప్రియదర్శి అనన్య ఈ టీవీ డిబేట్ నుంచి వచ్చిండ్రు.సినిమా మస్తుగుందిపో..ఎన్ని మాట్ల సూషినా మల్ల మల్ల సూద్దాంఅ నేటట్లనే ఉంది.అని మల్లేశం అన్నను కాగలించుకొని మనసుల మాట చెప్పిన .అన్నా నిజం గా జెప్తున్న ఈ సీన్మా మాత్రం తెలంగాణా ల ప్రతీ ఒక్కల్ల గుండెలల్ల ఉండిపోతది,గుండెలను తాకుతుంది, మనస్సు కరిగిస్తుంది అని చెప్పిన. నా పక్కనే ఉన్న డైరెక్టర్ సాబ్ ఆర్ రాజ్ తోని,వెల్డి రమేశ్ బాబు రియల్లీ వండర్ఫుల్ అని చెప్పిండు.సినీమా ఇంకా ఉంది సూడుండ్రి అన్న అని మల్లెశం అన్న అంటుండగనే,ఇంటర్వెల్ తర్వాత సినిమా స్టార్టయ్యింది. చూసిన తరువాత.. మాకు కలిగిన మధురానుభూతి.

మా మనసులోని మాటలే ఈ వ్యాసం

మల్లేశం ఒక వ్యక్తి కథ మాత్రమే కాదు, ఒక చిత్రవధకు గురవుతున్న ఛిద్ర నేత వ్యవస్థ వ్యధ.

మల్లేశం ఒక సినిమా మాత్రమే కాదు, ఒక జాతి జీవన కన్నీటిదార.

ప్రవాహంలో మునుగుతూ తేలుతున్నవాడికే తెలుస్తాయి ఈత కొట్టడంలో ఉన్న సాదక బాధకాలు. ఒక లక్ష్య సాధనలో ఎదురైన అవమానాలను దిగమింగి, అపజయాలను తట్టుకుని, పేదరికాన్ని, నిరక్ష్యరాస్యతను లెక్కచేయక సంకల్పంతో అనుకున్నది సాధించే వరకు మల్లేశం పడిన మానసిక సంఘర్షణే ఈ సినిమా. ఇది వ్యక్తిగతమైన కథ.

వ్యవస్థాగతంగా చూస్తే యంత్రాలొచ్చాక, ప్యాక్టరీలుపెట్టాక చేతిపనులు అడుగంటిపోయాయి. కుల వృత్తులు కూలబడిపోయాయి. అంతవరకు స్వయం ఉపాధి కేంద్రాలుగా, చిన్న తరహా పరిశ్రమలుగా పనిచేసిన కుటుంబాలు రోజు వారి కూలి పనులకు వెళ్ళలేక, తరతరాలుగా వస్తున్న చేతివృత్తులను మరువలేక నానా యాతన పడ్డారు. యంత్రం కొట్టిన దెబ్బని యంత్రంతోనే నయం చేయచ్చని నమ్మాడు చింతకింది మల్లేశం. పెద్దయంత్రం వల్ల కలిగిన గాయాన్ని చిన్నయంత్రంతో నయం చేసాడు. పెరుగుతున్న జనాభా కోరికలను, కొరతను తీర్చేలా చేతివృత్తిని చిన్నపాటి యాంత్రిక శక్తిగా మలిచే ఆలోచన చేశాడు. ఆరిపోతున్న చేనేత జీవన జ్యోతికి తనవంతు చమురునందించాడు. అలా చేనేత కులపురాణ భావనారుషిగా కీర్తిగడించాడు. కథానాయకులు ఎవరో కాదు మనలోనే సామాన్యులే పుడతారని ఈ సినిమా తెలిపింది. అంచెలంచెలుగా కష్టాల కడలి ఈదుకుంటూ నాయకులుగా ఎదుగుతారని నిరూపించింది మల్లేశం జీవితం. దీనిని వెండి తెరపై అత్యంత రమణీయంగా ఆవిష్కరించారు చిత్రబృందం.

ఈ సినిమా మా చిన్ననాటి జ్ఞాపకాలను, ఆటలను, పాటలను, సంస్కృతిని కలలా ఒక కళగా నా కళ్లముందు చూపించింది. ఇందులో ఆనాటి సంస్కృతి, భాష, యాస, భావోద్వోగాలు చక్కగా ఒదిగాయి. హీరో ప్రియదర్శి మల్లేశం పాత్రలో ఒదిగాడు. నటన లో ఎదిగాడు చాలా సార్లు కన్నీళ్లు తెప్పించాడు. హీరోయిన్ పాత్ర కూడా చాలా సహజంగా, అందంగా ఉంది. హీరో తల్లిగా ఝాన్సి, తండ్రిగా ఆనంద చక్రపాణి చాలా చక్కగా నటించారు. సినిమా ప్రారంభంలో వచ్చే తత్వగీతం మనసుని కదిలిస్తుంది. అన్ని పాటలు వినసొంపుగా సందర్భోచితంగా ఉన్నాయి. ఈ చిత్రాన్ని ఎంతో ఆత్మీయంగా తీర్చిదిద్దారు దార్శనికులు అనదగ్గ దర్శకులు రాచకొండ రాజ్, సినిమాలో హీరోయిన్ తండ్రిగా, సినిమా నిర్మాణంలో ప్రొడక్షన్ డిజైనర్ గానూ తన సృజనాత్మకతతో అసాధారణ సేవలందించిన డా. ఏలె లక్ష్మణ్, తెలంగాణ ఆత్మను వెండితెరపై ఆవిష్కరించారు.మల్లేశం తో సహజ నటుల నొసటన నుదిటి రాతనే తన గీతలతోమార్చారు.

ఉద్యోగర్జన కోసమో,సాంకేతిక నైపుణ్యాభివృధ్ధికోసమొ వృతివిద్య ను అభ్యసిస్తున్న కుర్రాళ్ళు ఈ సీనేమా చూస్తే మాత్రం.. బతకటానికి జీవితమే ఎన్నో సాంకేతిక మెలకువలను ఒంటబట్టిస్తుందన్న కఠోర వాస్తవాన్ని గ్రహిస్తారు. మనం అన్నం వండుకుని తినే బియ్యం దుకాణం లో దొరుకుతాయి అని మాత్రమే తెలిసిన కొందరు నవతరం యువతకు, ఆ బియ్యమే వరిపంట ద్వారా వడ్లు నూర్చగా వస్తాయన్న క్షేత్రస్థాయి పరిజ్ఞానం ఇప్పుడు అంతగా అవసరం లేని విషయంగా అవతరిస్తున్న పరిణామాల మధ్య విడులవుతున్న ఈ మల్లేశం సినిమా మాత్రం బతుకు పోరాట అవసరాలే భవితవ్యం బాట అన్వేషణ కోసం ఆలోచింపజేస్తాయని దృశ్య రూపంలో కళ్ళకు కట్టింది. గ్రామాల్లో మోట నుంచి మోటారు కు ఎదిగిన వ్యవసాయం మాదిరే..చేనేత లో చేతితో మాత్రమే చేసే ఆసు పద్దతిని, యంత్రం సాయంతో చేసే దాకా వచ్చిన సాంకేతిక క్రమం “మల్లేశం” తో ఆలోచింపజేసింది.అప్పట్లో ఊర్లోని కమ్మరి,కుమ్మరి,వడ్ల వాళ్ళు వ్యాసాయ పనిముట్ల తయారీకి ఏ ఇంజనీరింగ్ కోర్సులు చదివారు అన్న ప్రశ్నను రేకెత్తిస్తోంది మల్లెశం సినిమా. గంలోళ్ల మోకు, ఎడ్లబండి చక్రాలకు వాడే మేకు తయారీకి కేవలం బతుకుపోరాటం నేర్పిన జీవన పాఠాల ద్వారానే సాధ్యమైన సంగతి అందరికీ తెలిసిందే.

అందుకే ఇప్పుడు సాంకేతిక విశ్వవిద్యాలయాలు సైతం “క్షేత్ర”స్థాయిలో నే సాంకేతిక సృజణాత్మకత బీజాలు మొలకెత్తుతాయని గ్రహించి పల్లె బాట పడుతున్నాయి.ఇదే కోవలో యాదాద్రి జిల్లా రఘునాథ పురం లోని మాచన కృష్ణ సాంచెల పరిశీలనకు ట్రిపుల్ ఐటీ విద్యార్థులు వచ్చి పవర్ లూం సాంకేతికతను ప్రత్యక్షంగా పరిశీలించారు.అప్పటివరకూ సాధారణంగా తెలియని కొన్ని కొత్త సూక్ష్మ విషయాలను కనిపెట్టారు.ఏండ్ల సంది సాంచే నడుపుతున్న నాకే తెల్వని సంగతిని భావి ఇంజనీర్లు నాకు తెలిసేలా సూక్ష్మ గ్రాహ్యతతో పరిశీలించారని కృష్ణ వివరించారు.

మనిషి జీవన విధానానికి ఎన్నో వృత్తులు ఉన్నాయి.కానీ చేనేత వృత్తి వల్లే ప్రతి ఒక్కరికీ అవసరమైన వస్త్రం తయారవుతుంది. మానం కాపాడుకోవడానికి మాత్రమే బట్ట అవసరమయ్యే దశనుంచి.ఫ్యాషన్ రంగాన్ని ప్రభావితం చేయగలిగే ట్రెండ్స్ వరకూ వస్త్ర సోయగం పురోగమించింది.ఈ పరిణామం లొనే వస్త్రం పై ఆకర్షణీయమైన డిజైన్ లను అదనంగా నెసేందుకు చేయాల్సిన ఆసు పోయాడానికి చేసే శారీరక శ్రమను మల్లేశం కనిపెట్టిన “లక్ష్మి” ఆసు యంత్రం మటుమాయం చేసింది.ఈ ఇతవృత్తం ను రెండున్నర గంటల సినిమాలో జనరంజకంగా మాత్రమే గాక,మళ్ళి మళ్ళి చూడాలనిపించే మరపురాని చలన చిత్రంగా మలిచిన ఘనత మాత్రం ప్రవాస భారతీయుడైనప్పటికీ,తెలంగాణ నాడిని పసిగట్టదానికే రెవణ”పల్లె” బాట పట్టిన దర్శక రత్నం ఆర్ రాజ్ కె దక్కుతుంది.డబ్బులు గుమ్మరించి ఈ సినిమా నే ఎందుకు తీస్తున్నారు అని ఆయనను ప్రశ్నించినప్పటికీ మొక్కవోని దీక్ష తో పేగు బంధం కోసం పోగు భంధనమే మల్లేశం ఆసు యంత్రం కని పెట్టేలా కృషి జరిగింది.

మానవ జీవన ప్రమాణ పురోగతి పరిణామ క్రమంలో ఫోను ,విద్యుత్తు బల్బు,రేడియో,లు కనిపెట్టిబడినట్లే.2009 లో ఆసు యంత్రం చింతకింది మల్లేశం కనిపెట్టారు అన్న విషయం చరిత్ర పుటల్లో, చేనేత చరిత్రలోనే లిఖించబడుతొంది.1992 నుంచి మొదలైన ఆసు యంత్ర తయారీ ఆరాటం 1999 వరకూ ఏడేళ్లు సాగి 2009 లో ఆ యంత్రం పేటెంట్ హక్కులు పొందడం జరిగిందని పద్మాశ్రీ చింతకింది మల్లేశం వివరించారు.జూన్ 21 న సినీమా విడుదలను పురస్కరించుకుని సోమవారం నాడు భూదాన్ పోచంపల్లి లో చిత్రబృందానికి చేనేత సమాజం ఘన సన్మానం చేసిన తీరు.ఆ సినిమా నిర్మాణం లో భాగస్వాములైన ప్రతిక్కరినీ ఆత్మీయంగా పల్లె పలకరించిన పారవశ్యాన్ని కలిగించింది. ఇటీవల కాలం లో చేనేత కుటుంబాల్లోని యూవతీ యూవకులు “మల్లేశం అన్నా.. నువ్వు ఆసు మెషిన్ మాకు ఇయ్యక పోతే మేము ఆసు పోసుకుంటనే ఉండి టెన్త్ క్లాస్ తప్పేటోళ్లం. ఈ యంత్రం వుండడంవల్లే మంచిగా సదువుకున్నాం పదోది పాసైనం” అని నాకు ఎందరో ఫోన్ చేసి చెప్తుంటే నా మూలంగా విద్యార్థులు లాభపడ్డారన్న ఆనందం ఆత్మ సంతృప్తినిచ్చిందని చింతకింది మల్లేశం భావించేలా ఆసు యంత్రం ఆవిష్కరణ, ఎన్నో కుటుంబాల్లో ఆనందాన్ని ఆవిష్కరించింది.
                                                                                                       -మాచన రఘునందన్ ( రాష్ట్ర ప్రచార కార్యదర్శి,),  -డాక్టర్ వెల్డి రమేష్ బాబు, రాష్ట్రపతి పురస్కార గ్రాహిత శాస్త్రవేత్త, ఉపాధ్యక్షులు)

One Response to Mallesham is the biopic of Padma Shri awardee Chintakindi Mallesham

  1. RAGHUNANDHAN MAACHANA July 15, 2019 at 2:40 am

    Really wonderful

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Widgetized Section

Go to Admin » appearance » Widgets » and move a widget into Advertise Widget Zone