Mohana Krishna Bhargava Holds A Ph.D Doctorate In Astrology – Jyothishya Vishwa Vidhya Peetham(MP)

Mohana Krishna Bhargava Holds A Ph.D Doctorate In Astrology – Jyothishya Vishwa Vidhya Peetham(MP)

ICO (USA)., And Awarded “Jyothishya MAHARSHI” By All India Federation of Astrological Societies (Delhi)

25 ఏళ్ల అతిచిన్న వయసులోనే జ్యోతిష్య శాస్త్ర శిఖరంచును తాకిన డా” మోహనకృష్ణభార్గవ..

చతుర్వేదాలు, జ్యోతిష్యాది వేదాంగాలు భారతీయ సంస్కృతి కి మూలాలు సశాస్త్రీయ బాండాగారాలు., అందులో భూతభవిష్యత్వర్తమానాలను తెలిపే జ్యోతిష్య శాస్త్రానికి ప్రత్యేక స్థానం ఉంది.,

భృగుమహర్షి మొదలుకొని పూర్వయుగ మహర్షులకు, పరాశర, వరాహమిహీరాది మధ్య యుగ మహర్షులు, ఆర్యభట్టాది నవతర జ్యోతిష్య కారులు..
ఎన్నో జ్యోతిష్య పరిశోధనలు జరిపి ఎన్నో ఉద్గ్రంథాలు రచించి సమాజానికి అందించారు.,
కాలాలు మారినా యుగాలు మారినా ఎవరి ఊహకు అందనిది, ఎవరు పూర్తి గా దాటలేని సముద్రం లాంటిది జ్యోతిష్యం.,

నేటి ఆధునిక యుగంలో జ్యోతిష్యానికి ఎనలేని ప్రాముఖ్యత సంతరించుకొని ఎందరో విద్యార్థులు జ్యోతిష్య శాస్త్రాన్ని అభ్యసిస్తూ పరిశోధనలు జరుపుతున్నారు,.

అందులో ఒకరు.. ప్రముఖ జ్యోతిష్య పరిశోధకులు, సమాజ సేవకులు‌,… జనగామ జిల్లావాసి.
డా” ఎక్కలదేవి మోహనకృష్ణభార్గవ..
వృత్తి రీత్యా అతిపిన్న వయసులోనే స్మార్త పౌరోహిత్యం అభ్యసించి అటు పౌరోహిత్యములో రాణిస్తూ, ఇటు జ్యోతిష్య శాస్త్రంలో పరిశోధనలు జరుపుతున్నారు.,

పురోహిత సార్వభౌమ, జ్యోతిష్య శిరోమణి, జ్యోతిష్య మహర్షి వంటి బిరుదులతో పాటు మరెన్నో పురస్కారాలు ఘనసన్మానాలు అందుకున్నారు..

జ్యోతిష్య ప్రస్తానం..
పొట్టి శ్రీ రాములు తెలుగు యూనివర్సిటీ లో
సర్టిఫికేట్ ఇన్ ఆష్ట్రోలజీ కోర్స్ తో మొదలయిన జ్యోతిష్య ప్రస్తానం,
డిప్లోమా ఇన్ ఆష్ట్రోలజీ, పీజీ డిప్లోమా ఇన్ జ్యోతిర్వాస్తు పూర్తి చేసారు.,
ప్రముఖ జ్యోతిష్య పండితులు..
డా” శేషభట్టర్ వేంకటరమణాచార్యులు సిద్దాంతి వారి వద్ద ప్రముఖ ఘణాపాఠి డా ” తిప్పావజ్జుల శాయికృష్ణ శర్మ వద్ద జ్యోతిష్యం అభ్యసించారు.,
ఆ తదుపరి యూనివర్సల్ కాలేజ్ ఆఫ్ ఆష్ట్రోలజీ అక్కల్ట్ సైన్సెస్ లో అత్యున్నత
జ్యోతిష్య శిరోమణి తరగతులు పూర్తి చేస్కున్నారు.,
ఎంత చదివినా మరింత ఉత్సహత పెరుగుతూ మరింత సాధించాలనే కుతూహలాన్ని ప్రేరేపిస్తుంది జ్యోతిష్యం ‌.,
మోహనకృష్ణభార్గవ ప్రస్తానం జ్యోతిష్య శిరోమణితో ఆగలేదు..

ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపునొందిన..
న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ ఆష్ట్రోలాజికల్ సోసైటీస్ (AIFAS) విశ్వవిద్యాలయం లో అత్యంత ప్రతిష్టాత్మకమైన “జ్యోతిష్యమహర్షి” తరగతులు పూర్తిచేస్కుని మహర్షి పురస్కారాన్ని అందుకున్నారు,
ఇరు తెలుగు రాష్ట్రాలలో ఈ పురస్కారాన్ని అందుకున్న ఏకైక జ్యోతిష్య పండితుడు మోహనకృష్ణభార్గవ కావడం విశేషం.,

“సంతాన లేమి” (CHILDLESSNESS) అనే అంశంపై పరిశోధన గ్రంథాన్ని రచించి యూనివర్సిటీ కి సబ్మిట్ చేసారు,
నేటి సమాజంలో ప్రజలు అత్యధికంగా బాధపడుతున్న విషయం సంతాన లేమి, అపుత్రస్య గతిర్నాస్తి అన్నట్లు పిల్లలు కలగని దంపతుల పడే బాధ జ్యోతిష్యుడిగా పరిశోధకుడిగా చూసి చలించి అందుకు గల జ్యోతిష్య పరమైన కారణాలను, సప్రమాణికంగా సశాస్త్రీయంగా బృహత్ పరాశరా హోరా శాస్త్రం, సారావళి, బృహజ్జాతకం వంటి గ్రంథాల సహాయముతో … సంతానలేమితో బాధపడుతున్న 31మంది జాతకాలను విశ్లేషించి, పరిహార క్రియలతో గ్రంథాన్ని రచించి యూనివర్సిటీ కీ సబ్మిట్ చేసారు.,
అట్టి జ్యోతిష్య మహర్షి పరీక్షలలో 85% మార్కులతో A+ గ్రేడ్ పొందటం విశేషం..
మే నెల 26 న
న్యూఢిల్లీ లోని AIFAS కేంద్రమందు జరిగిన
AIFAS 18 వ వార్షికోత్సవ జ్యోతిష్య సదస్సులో
యూనివర్సిటీ
చైర్మెన్ DR. అరుణ్ కుమార్ బన్సాల్, జయ్ ప్రకాశ్ లాల‌్ దాగే వాలే, దాటి మహరాజ్ మదన్ లాల్ రాజస్థాని, బేని మాదవ్ గోస్వామి, రాజీవ్ శర్మ, మహరాజ్ దినేష్ గురూజీ, శ్రీమతి విద్యా దీవానీ, శ్రీమతి అభి బన్సాల్ చేతుల మీదుగా “జ్యోతిష్య మహర్షి” పట్టా అందుకున్నారు…

జ్యోతిష్యంలో PHD పూర్తిచేసి DOCTORATE – GOLDMEDAL అందుకన్న మోహనకృష్ణభార్గవ..

జూన 7 న
హైద్రాబాద్ లోని పద్మారావ్ నగర్ కౌతకామకోటి కళ్యాణమంటపం లో జరిగిన జ్యోతిష్య విశ్వవిద్యాపీఠం (ఓంకారేశ్వర్, మధ్యప్రదేశ్), INTERNATIONAL ACCREDITATION ORGANISATION(USA), & ASIA PACIFIC ACCREDITATION FORUM, విశ్వవిద్యాలయాల “ASTROLOGICAL SCIENCE CONVOCATION ” స్నాతకోత్సవం మరియు జ్యోతిష్యవిశ్వవిద్యాపీఠం 6th ASTRO SCIENCES SEMINAR
లో ముఖ్య అతిథులు ప్రముఖుసిద్దాంతి భక్తిటీవి ఉపన్యాసకులు డా” శంకరమంచి రామకృష్ణశాస్త్రి, జ్యోతిష్యవిశ్వవిద్యాపీఠం చీఫ్ అడ్వైసర్ శ్రీమతి డా” కవిత లలిత్ త్రివేది , దత్తపీఠం ఆస్థాన సిద్దాంతి డా” వావిలాల దామోధర్ శర్మ, తెలంగాణ ప్రభుత్వ ఆస్థాన వేద పండితులు డా”విరివింటి ఫణిశశాంక్ శర్మ, భరద్వాజ్ ఆష్ట్రో విషన్ డైరెక్టర్ డా”మహేష్ చందర్ భరద్వాజ్, ప్రముకుల చేతుల మీదుగా అత్యంత ప్రతిష్టాత్మకమైన డాక్టరేట్ & గోల్డ్ మెడల్ అందుకున్నారు, JVV లో PH.D పూర్తి చేసిన మోహనకృష్ణభార్గవ “ప్రత్యేక తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర సాధన, ఆవిర్భావ నిర్మాణాలపై జ్యోతిష్య శాస్త్ర ప్రభావం, కారకత్వాలు, విశ్లేషన” అనే అంశంపై పరిశోధనలు జరిపారు,
1952 ముల్కీ ఉద్యమం మొదలుకొని, 1969 ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనకై పోరాటం, తొలి మరియు మలిదశ ఉద్యమ నేపథ్యాలు, 2010 నుండి 2013 వరకు పోరాటాలు, 2014 ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన, విషయాంశాలపై జ్యోతిష్య శాస్త్ర రీత్యా దేశకాల వ్యవస్థ, గ్రహస్థితుల ఆధారితముగా నాటి ఉద్యమ కారకత్వాలనహ ప్రేరేపిత అంశాలను, ఉద్యమ అణచివేత, ప్రభుత్వ నిరంకుశత్వ పాలనలకు గల కారణాలను.,

తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలర్పించిన అమరులు :
కాసోజు శ్రీకాంతాచారీ,సిరిపురం యాదయ్య, లునావత్ బోజ్యానాయక్, ఇమామ్పూర్ యాదగిరి
నాటి పాలకులు :
పీవి నరసింహారావ్, మన్మోహన్ సింగ్, నీలం సంజీవరెడ్డి, మర్రిచెన్నారెడ్డి, కొనిజేటి రోశయ్య, YSR.,
తెలంగాణ పోరాటయోదులు :
కొమరంభీం,నల్లానర్సింహులు, చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య,.
ప్రజాప్రతినిధులు :
పాములపర్తి సదాశివరావ్, కొండా లక్ష్మణ్ బాపూజీ, ఆలె నరేంద్ర, టంగుటూరి అంజయ్య, రాపోలు ఆనందభాస్కర్, కల్వకుంట్ల చంద్రశేఖర్ రావ్, పొన్నాల లక్ష్మయ్య,.
కవులు కళాకారులు :
కాలోజీ నారాయణ్ రావ్, గద్ధర్, వరవర్రావ్, దాశరథి రంగాచార్య, గోరేటి వెంకన్న, సుద్దాల హనుమంతు, రసమయిబాలకృష్ణ,
విద్యావంతులు :
ప్రో’ కొత్తపల్లి జయశంకర్ ఆచార్య, ప్రో’ కొదండ రామ్, చుక్కా రామయ్య…

ఉద్యమ కాలంనాటి పాలకులు, నాయకులు, ఉద్యమ కారులు, ముఖ్యపాత్రదారులైన విద్యార్థులు విద్యావంతులు కళాకారులు ప్రజాప్రతినిథులు, విప్లవకారుల జాతకాలను ఆయా ఉద్యమ కాలాలనాటి గ్రహస్థితులను విశ్లేషించి 900 పేజీల PHD పరిశోధనా గ్రంథాన్ని రచించి JVV & ICO & APAF లకు సమర్పించి అత్యున్నత డాక్టరేట్ పురస్కారంతో పాటు గోల్డ్ మెడల్ అందుకున్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Widgetized Section

Go to Admin » appearance » Widgets » and move a widget into Advertise Widget Zone