Service to weavers

Service to weavers

The use of handloom textiles from the student stage

చేనేత కు చేవ “మాచన” సేవ

విద్యార్థి దశ నుంచే చేనేత వస్త్రల వాడకంService to weaversService to weaversService to weavers

మాచన రఘునందన్..వృత్తి రీత్యా ప్రభుత్వ అధికారి. ప్రజా సేవకుడిగానే గాక సంఘసేవకుడిగా సుపరిచితులు. ఉభయ సేవలందిస్తూనే.. ప్రవృత్తి గా చేనేత కూ చేతనైనంత సేవ చేస్తున్నారు ఈ పబ్లిక్ సర్వెంట్.
డియర్ ఫ్రెండ్..వియర్ హ్యాండ్లూమ్ అంటూ కరచాలనం చేస్తారు.ప్రాధేయపడి మరీ పలకరించే తమ స్నేహితుడి కోసం చేనేత వస్త్రాలను ధరించే వారు కొందరు.
హ్యాండ్లూమ్.. మేక్స్ హాండ్డ్సమ్ అని “మాచన”చెబితే గాని చేనేత వస్త్ర ధారణ పై తమకు అంతగా దృష్టి మళ్లలేదు అనే వారు మరి కొందరు.
అబ్బ.. ఈ చొక్కా ఎంత బాగుందో ఎక్కడ కొన్నావ్.. మిస్టర్ “మాచన” అంటే చాలు ఆ కంప్లిమెంట్ కామెంట్ చేసిన వారి చేత వారికి నచ్చిన ఆ అంగీ సమీపంలోని హ్యాండ్లూమ్ షోరూం లో ఆ పూటే కొనిపిస్తారు మాచన రఘునందన్. చేనేత వస్త్ర ప్రియుడిగా, ప్రోత్సహకుడిగా తన ఉనికిని చాటుకొనే ఈ వ్యక్తి వృత్తి రీత్యా అటు ప్రజా సేవకుడిగా పని చేస్తూనే ప్రవృత్తి గా చేనేత కు చేతనైనంత చేయూతనిస్తున్నారు ఈ ప్రజా సేవకుడు. చేనేత వస్త్రాల ను ధరించండి.. నేతన్నను ఆదరించండి. అంటూ అన్ని వర్గాల వారు విధిగా హ్యాండ్లూమ్ బట్టలు మాత్రమే వాడేలా శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారు.
తెలంగాణ పద్మశాలి ఆఫీషియల్స్ ప్రోఫ్ఫెషనల్స్ అసోసియేషన్ (టీ పొపా) కు రాష్ట్ర ప్రచార కార్యదర్శి గా వ్యవహరిస్తున్న మాచన రఘునందన్,చేనేతకూ ప్రత్యక్షంగా పరోక్ష్మంగా ప్రచారం చేస్తూ నేతన్నల బాగుకు మాట సాయం తో పాటు బాట సాయం చేసే మంచి మనసున్న మనిషిగా దిల్ దార్ డిప్యూటీ తహసీల్దార్ గా ప్రజా సేవతో పాటు, సంఘ సేవ చేస్తున్నారు. సన్నిహితులకు, బంధువులకు. మిత్రులందరికీ చేనేత వస్త్ర విశిష్టత ను వివరిస్తూ..వారిచేత కూడా చేనేత ఉత్పత్తులనే వాడేలా చేస్తున్నారు మాచన రఘునందన్. అందరిచేత సాధ్యమైనంత మటుకు చేనేత వస్త్రాలను వినియోగించేలా చేస్తూ.హ్యాండ్లూమ్ కు తన జీవితంలో అంత్యంత ప్రాధాన్యతనివ్వడంతో ఆదర్శంగా నిలుస్తున్నారు..పౌరసరఫరాల శాఖ డిప్యూటీ తహసీల్దార్ మాచన రఘునందన్.
ఆగస్టు 7 జాతీయ చేనేత దినోత్సవం .ఈ సందర్భంగా చేనేత కు చేవ కోసం తన వంతు చేయూత గా “మాచన” చేస్తున్న కృషి గురించి తెలుసుకుకుంటే ఆశ్చర్యం కలుగక మానదు.చదువుకునే రోజులనుంచే నిత్యం చేనేత వస్త్రాల వాడకం ఆరంభించారు. తన వివాహ సమయంలో కూడా చేనేత వస్త్రాలను మాత్రమే విధిగా వాడేలా నియమం పాటించారు.అటుపిమ్మట వివిధ ప్రధాన,సాధారణ కార్యక్రమంలో కూడా హ్యాండ్లూమ్ వస్త్ర వినియోగాన్ని విస్తృతం చేశారు. చేనేత ఉపయోగాలను సందర్భానుసారంగా జనబాహుళ్యాణికి తెలిసేలా తన దైనందిన జీవితంలో నిత్యం అనుదినం చేనేత వస్త్రాలనే ధరిస్తున్నారు. చేతిరుమాలు, తువ్వాలు, లుంగీలు,ఇలా ప్రతీ వస్త్ర ధారణకు చేనేత నే వాడుతున్నారు. 2015లో జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా దేశ రాజధాని కొత్త ఢిల్లీ లో రాపోలు ఆనంద భాస్కర్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి హాజరై తన నిబద్ధత చాటుకున్నారు.చేనేత కార్మికుల జీవితం ఆధారంగా ఇటీవలే వచ్చిన సినిమా మల్లేశం కు సైతం చక్కటి ఆదరణ లభించేలా “మాచన”ఇతోధిక సాయం చేశారు.ప్రతి ఏటా జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఉన్నతాధికారులకు చేనేత తువ్వా ళ్లతో సత్కరిస్తారు.మిత్రుల వివాహాది శుభకార్యాలకు హ్యాండ్లూమ్ షోరూం ను సందర్శించేలా చేసి, నచ్చిన వస్త్రాలు తక్కువ ధరలకే లభ్యమయ్యే తీరును ప్రత్యక్షంగా వివరిస్తున్నారు.
డియర్ ఫ్రెండ్.. వియర్ హ్యాండ్లూమ్ అంటూ కరచాలనం సందర్భంగా పాలకరించటం తన ప్రత్యేకతగా చేసుకున్నారు.
గత 2 దశాబ్దాలుగా కేవలం చేనేత వస్త్రాలనే విధిగా ధరిస్తున్నారు. కుటుంబం కూడా ధరించేలా చేశారు.ఇంట్లొ సైతం దుప్పట్లు,మొదలు వివిధ రకాల వస్త్రాలంకరణ కోసం చేనేతనే ఉపయోగిస్తున్నారు. పుట్టినరోజు.వివాహదినోత్సవాలకు కానుకలుగా చేనేత ఉత్పత్తులనే అలంకార వస్తువులుగా ప్రత్యేకంగా తయారు చేయించి ప్రదానం చేస్తున్నారు.స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా మువ్వన్నెల దండలను యాదాద్రి జిల్లా రఘునాథపురం లో మాచన కృష్ణ ప్రత్యేక నైపుణ్యం చేత తయారు చేయించి ప్రముఖులను సత్కరిస్తున్నారు.
సన్మానాలు,సత్కారాలకు శాలువాల బదులు కేవలం చేనేత తువ్వాళ్లను మాత్రమె వినియోగించాలని సూచిస్తున్నారు.హ్యాండ్లూమ్ ను ఆదరిస్తే.. ఒక నేత కార్మికుడి కుటుంబాన్ని ఆదుకున్నట్లే నని విషదీకరిస్తారు.రైతన్న కంటే నేతన్న నే అందరికీ అవసరమని, అన్నం లేకున్నా రెండు,మూడు రోజులు బతకొచ్చు కానీ, మానాన్ని కాపాడే వస్త్రం లేకపొతే క్షణం గడవదని చెప్తారు.చేనేత కుటుంబాలకు చెందిన యువతకు ఉన్నత విద్యా, ఉద్యోగావకాశాల లభ్యతపై అవగాహన కల్గిస్తున్నారు.మధ్యప్రదేశ్ సమాచార పౌరసంబంధాల శాఖ కమిషనర్ పరికిపండ్ల నరహరి యూవత కు చేసే లక్ష్య సాధన సలహాలను ప్రసంగాల విడియో లను చూపెట్టడం ద్వారా ప్రభుత్వ సాయంతో ఉన్నత ఉద్యోగాలను ఎలా సాధించగలరో వివరిస్తున్నారు.చేనేత వస్త్రాల ధారణ కోసం ప్రభుత్వ ఉద్యోగులకు రుణ సదుపాయం ఉన్న విషయాన్ని గుర్తుచేస్తూ తన సహోద్యోగులను హ్యాండ్లూమ్ వస్త్రాల కొనుగోళ్లకై ప్రోత్సహిస్తున్నారు.చేనేత విశిష్టత,ప్రత్యేకత లను ప్రాధాన్యత తో వివరించే మాచన రఘునందన్ శైలికి పద్మశ్రీ చింతకింది మల్లేశం సైతం ముగ్దుడై.”అన్నా..నువ్వు చెప్పినట్లు ఎవ్వరూ చెప్పలేరు” అని తన ను అభినందించారని మాచన రఘునందన్ ఆనందం వ్యక్తం చేశారు.

One Response to Service to weavers

  1. Raghunandan Maachana August 23, 2019 at 3:09 am

    Wonderful creativity

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Widgetized Section

Go to Admin » appearance » Widgets » and move a widget into Advertise Widget Zone