Telangana collapsing schools

Telangana collapsing schools

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం లోని మాచపూర్ జిల్లాపరిషత్ పాఠశాల పరిస్థితి చూస్తే పిల్లలు దేవాలయం గా భావించే బడి యేన అని కొద్ధి సేపు మౌనం దాల్చక తప్పదు. ఎందుకంటే దీనికంటే పశువుల పాకనే మేలు అని పిస్తుంది. పశువుల పాకకు అన్న పై కప్పు ఉంటది. పాఠశాలలో నుండి చూస్తే రంగు రంగుల ఆకాశం పిల్లలకు కనిపిస్తుంది. ఉదయం పిల్లలు వచ్చి గది లో నీడ ఎక్కడ ఎక్కడ ఉంటే అక్కడకు తిరిగి కూర్చునే దుస్థితి ఏర్పడింది. ఈ పాఠశాల లో దాదాపుగా 100 పైగా పిల్లలు చదువుతున్నారు. 8 మంది టీచర్లు ఉన్నారు. కానీ కూర్చొని చదవడానికి సరి అయిన గదులు లేవు. ఈ పాఠశాల ఎప్పుడు కూలిపోతుందో అని పిల్లల తల్లిదండ్రులు పాఠశాలకు పంపియ్యం అని ఎన్నోసార్లు వచ్చి చెప్పారు. కానీ టీచర్స్ పోయి ఇండ్ల లోకి వెళ్లి బతిమాలి తొలుకచ్చుకొని చదువు చెప్పిన రోజులు ఎన్నోసార్లు ఏర్పడ్డాయ అంటే మీరు నమ్మరు. ఏ ఒక్కరోజు జిల్లా విద్యాశాకాదికారి వచ్చి వెళ్లిన పాపాన పోలె అని అంటున్నారు పిల్లల తల్లిదండ్రులు . గదులు ఇదే విధం గా ఉంటే వచ్చే విద్యా సంవత్సరం పట్టుమని పదిమంది పిల్లలు కూడా రారు.ఇది మాత్రం జగమెరిగిన సత్యం. రాజీవ్ విద్య మిషన్ అధికారులు వచ్చి గదులను మరమ్మత్తు చేయిస్తారో లేక కొత్త గదులకు ఎస్టిమేట్ వేసి జిల్లా విద్యాశాఖాధికారి కి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి కొత్త గదులు నిర్మిస్తారో మీ ఇష్టం .కాని పాఠశాల నుండి పిల్లలు ప్రైవేట్ పాఠశాలలకు లేక ఇతర ప్రభుత్వ పాఠశాలలకు పోకుండా చూస్తే బాగుండు అని అంటున్నారు .పిల్లల తల్లిదండ్రులు. ఇప్పటికే ఎన్నో పాఠశాలలు తరగతి గదులు ఉన్న ఉపాధ్యాయులు లేక జీరో స్కూల్లు గా మిగిలిపోతున్నాయి. అన్ని ఉన్న అల్లుని నోట్లో శని అన్నట్టు పాత సమేత గుర్తుకు వస్తుంది. పిల్లలు ఉన్నారు నిష్ణాతులైన టీచర్స్ మంచి అనుభవం కలిగిన ప్రధానోపాధ్యాయులు బలరాం గారు ఉన్నారు కానీ గదులు లేవు . ఇప్పటికైనా అధికారులు స్పందించి పిల్లలకు ఇబ్బంది కలుగకుండా చూసి ఏది ఏమైనా పిల్లలు బయటకు వెళ్లకుండా చూస్తే బాగుంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Widgetized Section

Go to Admin » appearance » Widgets » and move a widget into Advertise Widget Zone